作曲:Thaman S
作词:Srimani
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కదా
చుర చుర చూపుల చాటున చిలిపితనం ఉరకలు వేద
సంగతం పలికేటి యీ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం
ఎప్పటికి తీరదు గ ప్రేమారునం కలహాన్నే చెరిపేసి యీ తరుణం
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా
కన్న ప్రేమ దాచ లేక
కన్న ప్రేమ దాచ లేక తన మాటల్నే దాచింది ఓ హృదయం
ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఎం లాభం
నిన్నై మరిచే వరం ఉంది కదా రేపటి అడుగే నేటికీ వారధి గ
చుట్టూతా చుట్టాల సందడిలో, పరివారం పెరిగేటి పందిరిలో
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
బుద్ధిమంతుడల్లే వీడే తన చూపుల్తో మాయేదో చేసాడే
వెన్న దొంగలాంటి వాడే కన్నె మనసుల్ని దోచేసే సోగ్గాడే
గారం పెంచి అల్లరి చేస్తాడా
వీడెక్కడి ఉంటె అక్కడ వేడుకలు
ఈ ఆనంద సందోహ సమయాన సరితూగవేపాటి సిరులైనా
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపినా